జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీవో శ్రీపతి బాపురావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వచ్చ హి సేవలో భాగంగా స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం బృహత్ పల్లె ప్రకృతి వనంలో అమ్మ పేరు మీద ఒక మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.