పెండింగ్ లో ఉన్న డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి డిమాండ్ చేశారు. కాగజ్ నగర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాప్యం లేకుండా పీఆర్సీ అమలు చేయాలని, పీఎస్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని, బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని డిమాండ్ చేశారు.