గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి పేల్చి వేసిన చెన్నూర్ పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో మరమ్మతులు చేపట్టనున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి విష్ణు ప్రసాద్ తెలిపారు. పట్టణ సీఐ రవీందర్ తో కలిసి మంగళవారం చెరువును పరిశీలించారు. ఆయకట్టు రైతుల పంటలకు నీరు అందేలా వెంటనే మరమత్తులు చేపడతామని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.