బెల్లంపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు పరిధిలోని బూడిది గడ్డ బస్తీలో జామ మసీదు ముందు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ , కమిషనర్ స్పందించి రోడ్డుకు మరమత్తులు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సయ్యద్ అహ్మద్ డిమాండ్ చేశారు.