వేమనపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కుర్ర వెంకటేశంతో పాటు 200 మంది మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు.