19 నుంచి ఆన్‌లైన్ విధానం: కలెక్టర్
NEWS Sep 17,2024 01:01 pm
ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులు రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన రవాణా, ఇతర ఖర్చులు మాత్రమే చెల్లించే విధంగా ఈ నెల 19 నుంచి ఆన్‌లైన్ విధానం అమల్లోకి తీసుకురావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.