ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌కే
NEWS Sep 17,2024 12:58 pm
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్లో చైనాపై 1-0తో గెలుపొందింది. దీంతో వరుసగా ఐదోసారి విజయం సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. కాగా, ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అదే జోరును ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగించింది. ఫైనల్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు.