కేసీఆర్‌కు మరోసారి నోటీసులు!
NEWS Jan 30,2026 10:23 am
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు నేడు సిట్ మరోసారి నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో నోటీసులు ఇస్తారా? ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న నందినగర్ నివాసంలో సిట్ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరగా, కేసీఆర్ అభ్యర్థన మేరకు నేడు మినహాయింపు ఇచ్చారు.