రాజానగరం మండలం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అదనపు బోన్లలను అమర్చినట్లు అటవీ శాఖ అధికారి భరణి తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. చిరుతకు సంబంధించిన ఏ విధమైన కదలికలు సీసీకెమెరాలలో గుర్తించలేదన్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారిపై పులి దాటినట్లు గుర్తించామన్నారు.