సింగరేణిలో యువ కార్మికులు సంఘటితంగా తమ శ్రమశక్తిని చాటితే కంపెనీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని సీ అండ్ ఎండీ ఎన్. బలరామ్ అన్నారు. మంగళవారం సింగరేణి భవన్ లో జరిగిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి వ్యాపార విస్తరణ దిశగా వేగంగా ముందుకు వెళ్తోందన్నారు. సమష్టి లక్ష్య దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలుస్తుందన్నారు.