ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
NEWS Sep 17,2024 12:30 pm
మల్లాపూర్: ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వాహిని జాతీయ పతకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రామ్మోహన్, ఉమా, ఇందిరా, ప్రభావతి, హెల్త్ అసిస్టెంట్ రవీందర్, శ్రీనివాస్, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.