సైబర్ నేరగాళ్ల ఉచ్చులో 14వేలు గుల్లా
NEWS Sep 17,2024 12:19 pm
జగిత్యాల: భీమారం మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొడుకు హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు. సదురు వ్యక్తికి పోలీసు ఫోటోఫ్రోపైల్‌తో కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడుతూ మీ కొడుకును గంజాయి కేసులో పట్టుకున్నాం, వదిలి పెట్టాలంటే 35 వేలు ఇవ్వాలన్నారు. తన వద్ద 14వేలు మాత్రమే ఉన్నాయని చెప్పగా ఫోన్‌పే చెయ్యమన్నారు. ఫోన్ పే చేసిన అనంతరం సదరు వ్యక్తి తన కొడుకుకు కాల్ చెయ్యగా తాను ఇంటివద్ద ఉన్నానని చెప్పటంతో మోసపోయానని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.