మల్లాపూర్ లో మోదీ జన్మదిన వేడుకలు
NEWS Sep 17,2024 11:48 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేశారు. గోపిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ పరిపాలనలో దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.