జాతీయస్థాయి ఇన్స్పైర్ మానాక్ లో హేమంత్
NEWS Sep 17,2024 11:57 am
సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల జిల్లా కేంద్రానికి చెందిన జక్కని హేమంత్, గైడ్ టీచర్ పాకాల శంకర్ గౌడ్ సహకారంతో రూపొందించిన పవర్ లూ మ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్ ఇన్స్పైర్ మానాక్ జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతుంది. జాతీయ స్థాయి ఇన్స్పైర్ మానాక్ కార్యక్రమాన్ని సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీగవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ అభయ్ కారందికర్ ప్రారంభించారు. నేత కార్మికులకు ఈ మిషన్ ఉపయోగపడుతుందని తయారు చేసిన హేమంత్, గైడ్ టీచర్ ను ప్రత్యేకంగా అభినందించారు.