ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
NEWS Sep 17,2024 11:55 am
రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఆర్డీవో రమేష్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసిల్దార్ మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.