మల్లాపూర్: విశ్వకర్మ జయంతోత్సవాలు
NEWS Sep 17,2024 10:49 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమేశ్వర కొండ కింద శ్రీ విశ్వకర్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సోదరులు ఐక్యతతో ఉండి పూజలు చేయడంతో పాటు ఉత్సవాలకు హాజరైన వారికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పిప్పోజి శ్రీనివాస్, పొలాస రాజయ్య చారి, సుభాష్, విశ్వబ్రాహ్మణ కులస్తులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.