మేడారం జాతరలో అత్యంత పవిత్ర ఘట్టంగా భావించే సమ్మక్క అమ్మవారు గద్దెపై చేరిన క్షణం భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. అటవీ ప్రాంతం నుంచి అమ్మవారు గద్దెపైకి చేరగానే లక్షలాది మంది భక్తులు జై సమ్మక్క–సారలమ్మ నినాదాలతో మారుమోగించారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచిచూసిన భక్తులు గద్దెపై అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడారం ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.