మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవార్ భార్య
NEWS Jan 29,2026 10:53 pm
అజిత్ పవార్ దుర్మరణంతో తదుపరి డిప్యూటీ సీఎం ఎవరు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించేది ఎవరు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ పేరును ప్రతిపాదిస్తున్నారు. బారామతి నుంచి ఆమెను ఉప ఎన్నికల్లో బరిలో దింపి, ఆపై ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ప్రఫుల్ పటేల్ చేపట్టే అవకాశముందన్న చర్చ కూడా సాగుతోంది. ఎన్సీపీ సీనియర్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది.