సమ్మక్క సారక్క అక్కా చెల్లెల్లా?
NEWS Jan 29,2026 11:57 pm
సమ్మక్క సారక్క (సారలమ్మ) తల్లీ కూతుర్లు. చాలా మంది అక్కాచెల్లెళ్లని అనుకుంటారు కానీ, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కథ ప్రకారం.. సమ్మక్క తల్లి, సారక్క (సారలమ్మ) ఆమె కూతురు. కాకతీయుల అన్యాయం మీద యుద్ధం చేసిన వీరమహిళలు ఇద్దరూ. సమ్మక్కకు సారలమ్మ, నాగులమ్మ అనే ఇద్దరు కూతుళ్లు, జంపన్న అనే కొడుకు ఉన్నారు. మేడారం జాతరలో భక్తులు తల్లి సమ్మక్కను, కుమార్తె సారలమ్మను ఇద్దరినీ సమానంగా పూజిస్తారు. అందుకే ఈ జాతరను "సమ్మక్క-సారక్క జాతర" అని పిలుస్తారు.