ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రెండవ దశ ప్రారంభం.
NEWS Sep 17,2024 11:53 am
రాజన్న సిరిసిల్ల: ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రెండవ దశను ప్రధాని మోడీ ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ నుంచి ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 2660 ఇండ్లు మంజూరయ్యాయని, 2004 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి 1860 ఇండ్లు పూర్తి చేశామని తెలిపారు.