మోడీ వీరాభిమాని ఆలయాల్లో శ్రమదానం
NEWS Sep 17,2024 11:02 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 74వ జన్మదినం సందర్భంగా, మల్యాల పట్టణ కేంద్రానికి చెందిన మోడీ వీరాభిమాని గంగిశెట్టి రాజేశం పట్టణంలోని పలు ఆలయాల్లోని పరిసర ప్రాంతాల్లో శ్రమదాన కార్యక్రమం చేపట్టాడు. ఇందులో భాగంగా స్థానిక మార్కండేయ, ఎల్లమ్మ, పోచమ్మ గుడి, శివాలయం ఆవరణలోని పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.