కొబ్బరి పీచు బొమ్మల తయారీ ద్వారా మహిళలు తమ జీవనోపాధిని పెంపొందించుకోవాలని మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన ఆక్సిజన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కటికిరెడ్డి గంగాధర్ సూచించారు. రాజమహేంద్రవరం ONGC సౌజన్యంతో పాశర్లపూడిలో సోమవారం మధ్యాహ్నం మహిళలకు ఉచిత బొమ్మల తయారీ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. 30మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు.