కాకినాడ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ సిటీ MLA వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి వనమాడి కొండబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి స్వచ్ఛతా ప్రమాణం చేశారు.