తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్‌లో జెండా ఆవిష్కరించి.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాలల్లో పాల్గొన్నారు. వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.