మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన మహోత్సవంలో భాగంగా శోభాయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని ముఖారామ్ చౌరస్తాలో హిందూ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.