రాజమండ్రిలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రధాని మోదీ మలిచారని కొనియాడారు. రాబోయే బీజేపీ పాలనలో 3వ ఆర్థిక శక్తిగా మలచడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.