జియో సేవలకు అంతరాయం
NEWS Sep 17,2024 09:35 am
దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ జియో సేవలు మరోసారి నిలిచిపోయాయి. సెప్టెంబర్ 17న ముంబై నుండి ఈ అంతరాయం ప్రారంభమై.. దేశంలోని అన్ని నగరాల్లో Jio డౌన్ అయింది. డౌన్ డెటెక్టర్ మ్యాప్ ప్రకారం.. న్యూఢిల్లీ, లక్నో, నాగ్‌పూర్, కటక్, హైదరాబాద్, చెన్నై, పాట్నా, అహ్మదాబాద్, కోల్‌కతా, గౌహతి వంటి నగరాల్లో Jio సేవలు నిలిచిపోయాయి. 1 గంటలో 10 వేల మందికి పైగా డౌన్‌డెటెక్టర్‌పై ఫిర్యాదులు చేశారు.