గోదావరి ఒడ్డున వ్యక్తి మృతదేహం
NEWS Sep 17,2024 10:04 am
ముమ్మిడివరం మండలంలోని వృద్ధ గౌతమీ గోదావరి ఒడ్డున మంగళవారం ఉదయం వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారి సమాచారంతో ముమ్మిడివరం సీఐ కె.మోహన్ కుమార్, ఎస్.ఐ జ్వాలా సాగర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ బ్యాగులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు విజయవాడకు చెందిన ఉదని సత్యనారాయణ(53) గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.