అర్జీలు స్వీకరించిన కాకినాడ ఎంపీ
NEWS Sep 17,2024 10:04 am
జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమం ద్వారా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారు తెలిపిన సమస్యలు నమోదు చేసుకున్నారు. తక్షణ పరిష్కారం అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కొత్తపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు