నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హి సేవ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛత హి సేవ పక్షోత్సవాలు తొలి రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పక్షోత్సవాల్లో సచివాలయ సిబ్బంది మండలంలోని ప్రతి ఇంటికి వెళ్లి స్వచ్ఛ భారత్ గురించి నినాదాలు తెలియజేయాలని తెలిపారు.