జాతీయ నులిపురుగుల నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. పెద్దాపురం డిప్యూటీ DMHO డాక్టర్ సరితతో పాటు మరికొందరు అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసి దానివల్ల కలిగే ఉపయోగాలు వివరించారు. మంగళవారం మాత్రలు తీసుకోని వారికి ఈనెల 25న మళ్లీ పంపిణీ చేస్తామన్నారు.