ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులను కలుపుకొని త్వరలో పార్టీ పెట్టబోతున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ G.V హర్షకుమార్ ప్రకటించారు. సోమవారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశంలోని మాదిగ సామాజికవర్గం అంతా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తుంటే తెలుగు రాష్ట్రాల మాదిగలు మాత్రమే స్వాగతిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మాయలో పడి ఇతర పార్టీలు కూడా ఎస్పీ వర్గీకరణని వ్యతిరేకించడం లేదని అన్నారు.