ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదురుడు 11 రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 1.34 గంటలకు మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. మహా గణపతి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో హోరెత్తిపోయాయి. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భక్తులు తరించిపోయారు.