కె. గంగవరం (పామర్రు) మండలంలోని ఎండగండి గ్రామంలో ఉన్న హెరిటేజ్ డైరీ పరిశ్రమను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా డైరీలో పనిచేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. డైరీకి సంబంధించిన పదార్థాలు తయారయ్యే విధానాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.