రాజమహేంద్రవరం నగరంలోని వై. జంక్షన్ వద్ద స్వచ్ఛత హి సేవా ర్యాలీని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత సేవా కార్యక్రమం నిర్వహణ ద్వారా ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వచ్ఛతపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.