మోడీ పుట్టినరోజు వేడుకలు
NEWS Sep 17,2024 09:59 am
పి. గన్నవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు యర్రంశెట్టి సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పి. గన్నవరం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెరుకూరి గోపాలకృష్ణ, జనసేన నాయకులు వాసంశెట్టి కుమార్, మద్దా చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు.