ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
NEWS Sep 17,2024 10:01 am
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఎం. శ్రీనివాస్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ సురేంద్ర, ఆర్ఐ దామోదర్, తదితరులు పాల్గొన్నారు.