చీపురు చేత పట్టిన మండపేట MLA
NEWS Sep 17,2024 10:01 am
మండపేట పరిశుభ్రతలో నంబర్ వన్ స్థానానికి చేరాలని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. పట్టణంలో స్వచ్చతా హీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షత వహించారు. ఇన్ ఛార్జ్ కమిషనర్ తాతపూడి కనకరాజు ఆద్వర్యంలో రోటరీ క్లబ్, స్వచ్ఛంద సంస్థలు,పారిశుధ్య కార్మికులు ఉద్యోగులకు సిబ్బంది విద్యార్థులచే మానవహారం ఏర్పాటు చేశారు.