జగన్‌కు మానసిక స్థితి సరిగా లేదు:
వాసంశెట్టి సుభాశ్
NEWS Sep 17,2024 10:01 am
కాకినాడ రూరల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులను మంత్రి వాసంశెట్టి సుభాశ్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్‌కు అధికారం కోల్పోవడంతో మానసిక స్థితి సరిగా లేదని, దాంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. భారీ వరదలు వచ్చిన సమయంలో కావాలనే బురద రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.