ప్రజాపాలన సాగిస్తున్న ప్రభుత్వం
NEWS Sep 17,2024 09:53 am
బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మూచర్ల మల్లయ్య పాల్గొన్నారు.