తెలంగాణ తల్లికి కేటీఆర్ పాలాభిషేకం
NEWS Sep 17,2024 07:38 am
హైదరాబాద్: జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.