గణేష్ నిమజ్జన మహోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయంలో నవరాత్రులు అశేష భక్తజనం పూజలు అందుకున్న గణనాథుడిని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణపతికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.