HYD: గడిచిన పదేళ్లు నియంత పాలనలో మగ్గిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తన ఢిల్లీ పర్యటనపై చేస్తున్న విమర్శలను తప్పుబడుతూ తెలంగాణ హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానన్నారు. కేంద్రం నుంచి రావలసిన ప్రతి పైసా తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానన్నారు. సెప్టెంబర్ 17 ను కొంతమంది వివాదాస్పదం చేస్తున్నారన్నారు.