కోటపల్లిలో ఘనంగా
తెలంగాణ విమోచన దినోత్సవం
NEWS Sep 17,2024 07:25 am
కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల ఉపాధ్యక్షులు పెద్దింటి పున్నం చంద్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపై వేల మంది ప్రజలు విరోచితంగా పోరాటం చేశారని కొనియాడారు. ప్రజల బలిదానాలు, త్యాగాల తరువాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.