హైదరాబాద్ శివారులోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వారు.. వేలంలో లడ్డూను రూ.1.87 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. రిచ్ మండ్ విల్లాస్ కి చెందిన ఆర్వీ దివ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా వేలంలో తమ ప్రాజెక్టులో ఉన్న విల్లాల వారంతా కలిసి క్రౌడ్ ఫండింగ్ చేపడతారు. వారంతా కలిసి ఇచ్చిన మొత్తాల్ని ఏక మొత్తంగా చేస్తారు. ఆ మొత్తాన్ని లడ్డూ వేలం మొత్తంగా డిసైడ్ చేస్తారు.