మోడీ పుట్టిన రోజు వేడుకలు
NEWS Sep 17,2024 07:03 am
జోగిపేట: ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు పండ్లు పంపిణీ చేశారు. దేశం కోసం, పేద ప్రజలకు అండగా ఉంటూ, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న గొప్పనాయకుడు మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పులుగు గోపాల్, ఉల్వల వెంకటేశం, రవీంద్ర గౌడ్, అనిల్, గాజుల నవీన్, నాయకులు ప్రభాత్ కుమార్, జైస్వాల్ పాల్గొన్నారు