ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
NEWS Sep 17,2024 07:00 am
మల్యాల మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా పాలన దినోత్సవాన్నీ అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో PACS చైర్మన్ రాంలింగారెడ్డి జాతీయ గీతాన్ని ఆలపించి జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.