HYD: ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడిలోకి వెళుతున్నాడు. సకాలంలో నిమజ్జనం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసున్నామని ఉత్సవ కమిటీ ప్రతినిధి మహేశ్ యాదవ్ తెలిపారు. సచివాలయం మీదుగా సాగర తీరానికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవ్వగా, మధ్యాహ్నం 2 గంటల వరకు నిమజ్జనం పూర్తి అవుతుందని పోలీసులు చెప్పారు.