రికార్డు: బాలాపూర్ లడ్డూ 30,1000
NEWS Sep 17,2024 05:46 am
బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలంలో 30 లక్షల వెయ్యి రూపాయలకు.. కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల రూపాయలు అదనంగా వెళ్లింది వేలం. బాలాపూర్ లడ్డూ వేలంలో ఇదే రికార్డ్. లక్ష్మీనారాయణ, ప్రణీత్ రెడ్డి, కొలన్ శంకర్ రెడ్డి, దశరథగౌడ్ నలుగురు వ్యక్తులు గట్టిగా పోటీపడ్డారు. నలుగురు వ్యక్తులు లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు చివరి వరకు పోటీ పడ్డారు. చివరకు కొలన్ శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూని దక్కించుకున్నారు.