జాతీయ జెండా ఎగురవేసిన కలెక్టర్
NEWS Sep 17,2024 07:00 am
మంచిర్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.